Tuesday, July 13, 2010

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఏ పువ్వు ఏ తేటిదన్నదో ఏనాడో రాసున్నది ....
ఏ ముద్దు ఏ మోవిదన్నదో ఏ పొద్దో రాసున్నది ....
బంధాలయి పెనవేయు వయసుకు అందాలే దాసొహమనగా ....
మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూదమనగా
పరువాలే .... ప్రణయాలై ... స్వప్నాలే .... స్వర్గాలై ..
ఏన్నెన్నొ శ్రుంగార లీలలు.. కన్నుల్లో రంగేళి అలిగెను

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..
ఆవేశం ఏనాడు కలిగెనొ ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది..

ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో
హ్రుదయాలే తెర తీసి తనువుల కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని కరిగించి గెలిపించమనగ
మొహాలె... దాహాలై ...సరసాలే... సరదాలై...
కాలాన్నే నిలదీసి కలలకు ఇవ్వాలి వెలలేని విలువలు..

No comments:

Post a Comment