Wednesday, February 3, 2010

నాకు నచ్చిన రాధిక గారి పాట

నీవు రాక ఎందరున్నా ఒంతరవుతాను ఎందుకో
నిన్ను చూస్తె నన్ను నేను మరచిపోతాను ఎందుకో
కనుల ముందుకు నేరుగా నే రాను అంటావు ఎందుకో
కలత నిదురలో కలలాగా వెనువెంట వస్తావు ఎందుకో...


నిదురనే మరచి నా కన్నులే అలసినా వేచెనెందుకో
తలపులో నిలచి నీ రూపమే గుండెనె తట్టెనెందుకో
ఈ లోకమే వెలివెసినా నీ కొసమే ఎదిరించనా
మనసా.. మనసా.. నీవుగ వలచి విడిచావెందుకో.. ఎందుకో..

చినుకులా తడిపి నీ స్నేహమే మెరుపులా వెళ్ళెనెందుకో
కెరటమై ఎగసి నీ ప్రేమ నురగల కరిగెనెందుకో
ఈ దూరమే బాధించినా ఎదబాటునె కలిగించినా
ఏ గాయమే నువు చేసినా పసిపాపలా నిను చూడనా
మనసా.. మనసా.. మౌనమే నేర్చినావు ఎందుకో.. ఎందుకో..

నా మొదటి పాట

మనసు పలకని మాటకు దారి తెలియని బాటకు
చితికి పొయిన గుండెకు ఏమి తెలుప నా సఖి ఇంకేమి తెలుప ప్రియసఖి...
గుండెలొని భావమె పెదవి మాటున మౌనమె
నేను రాసిన కావ్యమె తెలుసు కొవే నా సఖి నే తెలుపలేనె ప్రియసఖి...

ఆ నింగి లో నువ్వలా ధ్రువ తార లాగ వెలిగితే
ఈ నేలపై నే నిల పసిపాప లాగా అలిగితె
నా శ్వాసే కంటి భాషల నా ఆశే కొంటే ఊసుల
నిను పలకరించె వేళ నే పులకరించి పోన............ "మనసు"